టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ సస్పెన్షన్

Naramalli Sivaprasad
Naramalli Sivaprasad as M. G. Ramachandran

లోక్ సభలో సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారంటూ.. పదే పదే సభకు శివప్రసాద్ అంతరాయం కల్గిస్తుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.

తమిళనాడు మాజీ ఎంసీ ఎంజీఆర్ వేషధారణలో ఉన్న ఎంపీ శివప్రసాద్ పోడియంను చుట్టుముట్టి… ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించినందుకు శివప్రసాద్‌తో పాటు అన్నాడీఎంకే కు చెందిన ఇద్దరు ఎంపీలను కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు.