ఎమ్మెల్యే కిడారి హ‌త్య‌పై ఏపి అసెంబ్లీ సంతాపం

AP Assembly, TDP MLA Kidari Sarveswara Rao, Telugu Desam Party
Kidari Sarveswara Rao

అరకులో వంద పడకల ఆస్పత్రికి టీడీపీ నేత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పేరు పెడుతూ ఆంద్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు నిర్ణయం తీసుకుంది. అర‌కు నియోజకవర్గంలో సివేరి, కిడారి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సివేరి, కిడారి హత్య జరిగిన చోట స్మారకం ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్రకటించారు.

మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి, సివేరు సోమ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయ‌న హామీ ఇచ్చారు. కిడారి హత్య దారుణమని అసెంబ్లీలో సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. కిడారి హత్య ప్రజా స్వామ్యానికి తూట్లు పొడవటమేనని సభ్యులు విచారం వ్యక్తం చేశారు.