నటుడు మురళీ మోహన్ సంచలన నిర్ణయం…!

Murali-Mohan
Murali-Mohan

టిడిపి రాజమండ్రి ఎంపి,నటుడు మురళీ మోహన్ క్రియా శీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగరాదని నిర్ణయం తీసుకున్నా రు. ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు సైతం ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు.కాగా ఇక నుండి తాను ఏర్పాటుచేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.

ఈరోజు అమరావతిలో రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్‌ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేయనున్నట్లు సమాచారం.