ఏపిలో సైకిల్ కు దూరంగా హ‌స్తం

Tdp,Congress Alliance
Tdp,Congress Alliance

తెలంగాణ ఎన్నిక‌ల్లో కూట‌మి పేరుతో హ‌స్తం పార్టీతో సైకిల్ జ‌త‌క‌ట్టింది. అయితే రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగాల‌ని డిసైడ్ అయింది. విజ‌య‌వాడ‌లో ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమన్ చాందీ , ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి త‌దిత‌రులు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై కేడ‌ర్ మ‌నోభిప్రాయాలు తెలుసుకున్న త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమన్ చాందీ స్పష్టం చేశారు .

ఎన్నికల కార్యాచరణను రూపొందించడానికి ఈనెల 31న మరోసారి సమావేశమవుతామని వెల్ల‌డించారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెలలోనే ఎన్నికల కమిటీకి సంబంధించిన నివేదికను అధిష్ఠానానికి పంపుతామని చెప్పారు. ఇటు టిడిపితో సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు ఎపికి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1న జరిగే బంద్‌కు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన వివ‌రించారు.