అష్టకష్టాల్లో వర్మ

ArjunReddy Remake in Tamil Varma
ArjunReddy Remake in Tamil Varma

బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కి వివాదాలతో పాపులర్ అయ్యి ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా అర్జున్ రెడ్డి.ఈ సినిమాని తమిళ్ లో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు.హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బాల దర్శకుడిగాఈ సినిమా మొదలయింది.కానీ ఈ సినిమా స్టార్టింగ్ లోనే నెగెటివ్ వైబ్రేషన్స్ తో మొదలయ్యింది.

ఈ సినిమా చెయ్యమని తన కుమారుడు ధృవ్ ని కాస్త ఫోర్స్ చేసి ఒప్పించాడు విక్రమ్.అలా స్టార్ట్ అయిన ఈ సినిమా టీజర్ చూసి అంతా షాక్ అయ్యారు.అసలు అర్జున్ రెడ్డి ఎస్సెన్స్ ఏ మాత్రం కనిపించలేదు.చాలా నిర్జీవంగా ఉండడంతో అంతా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కానీ ట్రైలర్ వరకు కాస్త జాగ్రత్త పడ్డారు.

అయితే ఈ సినిమా మొత్తం పూర్తయిన తరువాత ఆ సినిమా మేకర్స్ ఇది ఒక చెత్త ప్రోడక్ట్ అని,బాలా సినిమాని కిల్ చేసేసాడు అని రాద్ధాంతం చేస్తూ,ఈ సినిమాని మరొక డైరెక్టర్ తో మళ్ళీ రీషూట్ చేస్తాం అని చెప్పడంతో అంతా అవాక్కవుతున్నారు.బాలా కూడా ఈ సినిమానుండి తానే తప్పుకున్నాడు అని చెప్పాడు.

సినిమా మొత్తం అయిపోయిన తరువాత మళ్ళీ రీ షూట్ అంటే అందరికి కూడా నష్టం, కష్టం తప్ప ఏం లాభం ఉండదు?.ఇప్పుడు మరీ ముదిరిని ఈ వివాదం ఎంతవరకు వెళుతుంది?…ఎక్కడ ఆగుతుంది? అనేది ఇప్పడు తమిళ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.