ప్రొడ్యూసర్స్ గా మారుతున్న ఇద్దరు హీరోయిన్స్

Tamannah and kajal
Tamannah and kajal

లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత టాప్ హీరోయిన్ గా ఎదిగింది  కాజల్ అగర్వాల్.స్టార్ హీరోస్ అందరితో చాలా సినిమాలు చేసింది.ఇంకా చేస్తుంది కూడా.భారతీయుడు-2 లాంటి ప్రెస్టీజియస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఇన్నాళ్లు కేవలం హీరోయిన్ గా మాత్రమే ఉన్న కాజల్ ఇప్పడు మాత్రం ప్రొడ్యూసర్ గా మారుతుంది.

అ సినిమా షూటింగ్ టైం లో ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన ఒక లైన్ కాజల్ కి బాగా నచ్చడంతో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది.KA మూవీస్ అనే పేరుతో ఈ బ్యానర్ స్టార్ట్ కాబోతుంది.అయితే ఈ సినిమాకి తమన్నా కూడా మరో నిర్మాతగా ఉండబోతుంది అనే మాట మరింత సర్ప్రైసింగ్ గా ఉంది.ప్రస్తుతం క్వీన్ రీమేక్ తమిళ్ వెర్షన్ లో కాజల్,తెలుగు వెర్షన్ లో తమన్నాలీడ్ రోల్ లో కనిపిస్తున్నారు.

తెలుగు వెర్షన్ లో కొంత పార్ట్ ప్రశాంత్ డైరెక్ట్ చేసాడు.ఆ టైం లో అతని టాలెంట్ పై నమ్మకం కుదిరిన తమన్నా కూడా కాజల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యిందట.మొత్తానికి హీరోయిన్స్ నిర్మాతలుగా మారడం అనే రేర్ ట్రెండ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాజల్ అండ్ తమన్నా.వీళ్ళు ప్రొడ్యూసర్స్ గా కూడా సక్సెస్ అవ్వాలని విషెస్ లో ముంచెత్తుతున్నారు అభిమానులు.