హారీష్ రేంజ్ ఏంటి ఇలా పడిపోయింది?

Harish-Shankar
Harish-Shankar

మిరపకాయ్ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న హరీష్ శంకర్…గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.కానీ ఆ తరువాత జూనియర్ NTR తో రామయ్య వస్తావయ్య అనే సినిమా చేస్తే ఉపయోగం లేకుండా పోయింది.దాంతో డిఫెన్స్ జోన్ లోకి వెళ్లిన హరీష్ శంకర్ తనకి వచ్చిన అన్ని విద్యలను కలిపి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మిక్చర్ ను తయారు చేసి బాగానే సేల్ చేసాడు.

కానీ ఆ తరువాత వచ్చిన DJ హరీష్ శంకర్ పేరుకి దారుణమయిన బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టింది.దాంతో దిల్ రాజు బ్యానర్ లో చేద్దాం అనుకున్న దాగుడుమూతలు ప్రాజెక్ట్ మెటీరిలైజ్ కాలేదు.నాని,శర్వా లను ఒప్పించడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు.దాంతో ఒక పాత తమిళ రీమేక్ ని ఓకే చేసుకున్నాడు.వరుణ్ తేజ్ అందులో విలన్.సినిమా పేరు వాల్మీకి.అయితే ఆ సినిమాలో హీరోగా ఎవరు ఫైనల్ అవుతారా అని అంతా ఎదురుచూసారు.

పెద్ద ప్రొడక్షన్ హౌస్,టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి క్రేజ్ ఉన్న హీరోని దింపుతారు అనుకుంటే శ్రీ విష్ణు ని ఓకే  చేసారు.తమిళ్ వెర్సిన్ లో సిద్దార్థ్ పోషించిన పాత్రని ఇక్కడ శ్రీవిష్ణు తో చేయిస్తున్నారు.హరీష్ ఇప్పుడున్న స్టేజ్ కి అంతకంటే పెద్దవాళ్ళు దొరకడం కూడా కష్టమే.అందుకే ఈ సినిమావరకు అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్న హరీష్ అవుట్ ఫుట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.ఆల్ ది బెస్ట్ టు హరీష్ శంకర్.