సైరా ప్యాకప్

Syeraa Narsimha Reddy
Syeraa Narsimha Reddy

టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఒక ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కుతుంది సైరా నరసింహారెడ్డి.ఈ సినిమా ఈ సంవత్సరం దసరా కి రిలీజ్ అని రామ్ చరణ్ ప్రకటించిన ఆ డేట్ కి రాదు అంటూ టీమ్ నుండి వార్తలు వచ్చాయి.నిజానికి సైరా విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.అయితే లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది.

ఇంకో నాలుగు రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిగా ప్యాక్ అప్ అయిపోతుంది.అప్పుడు అసలు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత టైం పడుతుంది?,రిలీజ్ కి ఎప్పుడు రావచ్చు అనే అంశాలపై అందరికి ఒక క్లారిటీ వస్తుంది.ఈ సినిమా హీరో ఇంట్రడక్షన్,ఇంటర్వెల్ ఫైట్స్,క్లయిమాక్స్ కోసమే ఎక్కువ టైం తీసుకున్నారు.మిగతా సినిమా త్వరగానే పూర్తయిపోయింది.

సో ,అందరు మెయిన్ ఆర్టిస్టుల కాంబినేషన్ లో వచ్చే ఆ నాలుగు రోజుల షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే సైరా రిలీజ్ కి అఫీషియల్ డెడ్ లైన్స్ ఫిక్స్ అయిపోతాయి.అయితే ఈ సినిమాని నేషనల్ వైడ్ గా రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి అన్నిచోట్ల కంఫర్ట్ ఉన్న డేట్ చూసుకుని రిలీజ్ కి వెళతారు.బహుశా అది 2020 సంక్రాంతి సీజన్ కావచ్చు.