కాప్పాన్ టీజర్:సూర్య ఈజ్ బ్యాక్

Surya Kappan Movie
Surya Kappan Movie

కాప్పాన్…ఇది సూర్య నటించిన రీసెంట్ మూవీ.తెలుగులో తమిళ్ తో పాటు సమాంతరమయిన మార్కెట్ ఉన్న సూర్య ఈ సినిమావరకు మాత్రం తమిళ్ కే పరిమితం అయ్యేలా ఉన్నాడు.దానికి కారణమ్ ఈ సినిమా కథ.ఈ సినిమా మెయిన్ ప్లాట్ అంతా కూడా తమిళ రాజకీయాల పైనే నడిచేలా కనిపిస్తుంది.ఇండియా సూపర్ పవర్ గా ఎదగడానికి తమిళనాడు ని పూర్తిగా ఎడారిగా మార్చెయ్యాలి అనే ప్లానింగ్ జరగడం,దాన్ని ఎదుర్కోవడానికి రైతు లా ఉన్న సూర్య టెర్రరిస్ట్ గా మారడం లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని కలుపుకుంటూ ఈ సినిమా కి పకడ్బందీ కథని తయారుచేసుకున్నట్టు కనిపిస్తుంది.ఇంతకుముందు KV ఆనంద్ చేసిన మిగతా సినిమాల్లానే ఇందులో కూడా మంచి కథని ఎంచుకున్నాడు అనిపిస్తుంది.

ఈ సినిమా లో సూర్య మళ్ళీ మరో ఛాలెంజింగ్ పాత్రని ఎంచుకున్నాడు అని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.అనేక రకాల గెటప్స్ లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేసాడు అని చెప్పుకోవాలి.మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ముఖ్యమయిమ పొలిటికల్ లీడర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు.ఇక బొమన్ ఇరానీ,సముధ్రఖని…ఇలా అనేక మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో కీ రోల్స్ పోషించారు.అలాగే రీసెంట్ గా భార్యభర్తలుగా మారిన ఆర్య ,సయేశా లు లవర్స్ గా నటించడం కూడా బాగా వర్క్అవుట్ అయ్యేలా కనిపిస్తుంది.హారిస్ జై రాజ్ మ్యూజిక్ సినిమా కంటెంట్ ని ఎలివేట్ చేస్తుండగా,KV ఆనంద్ విజువల్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయి.లైకా ప్రొడక్షన్ అన్ కాంప్రమైజ్డ్ గా ఈ సినిమాని నిర్మించింది అని టీజర్ తోనే క్లారిటీ వచ్చింది.ఓవర్ ఆల్ గా చూస్తే ‘కాప్పాన్’ లో హిట్ కళ కనిపిస్తుంది.