నటి సురేఖ వాణి భర్త కన్నుమూత

SurekhaVani
SurekhaVani

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.! నటి సురేఖ వాణి భర్త, టీవీషోల దర్శకుడు సురేశ్ తేజ తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ సోమవారం కన్నుమూసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సురేఖ కుటుంబ సభ్యులుగానీ, మిత్రులు కానీ ఇంతవరకూ స్పందించలేదు. సురేశ్ ఇకలేరన్న వార్త తెలుసుకున్న టాలీవుడ్ నటీనటులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియావేదికగా.. ప్రగాఢ సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.! అయితే ఈ విషయాన్ని కుటుంబ వర్గీయులు ధృవీకరించాల్సి ఉంది.

కాగా.. సురేశ్ తేజ పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. ‘మా’టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలతో సురేశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసే షోలకు సురేఖ యాంకర్‌గా వ్యవహరించేవారు. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమ దాకా వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. బడిలో చదివేటపుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓ లోకల్ ఛానెల్లో పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేది. అలా.. ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి వ్యాఖ్యాతగా మారింది. పెళ్ళైన తరువాత ‘మా’టీవీలో భర్తతో కలిసి చేశారు.