మన్మధుడు-2 లో సూపర్ సర్ప్రైజ్

Nagarjuna-Manmadhudu-2
Nagarjuna-Manmadhudu-2

మన్మధుడు-2 సినిమా షూటింగ్ వచ్చే నెలలో పోర్చుగల్ లో మొదలు కానుంది.అఖిల్,చైతు ల సినిమాలను పక్కనబెట్టి నాగార్జున ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది.సూపర్ హిట్ ఎంటెర్టైనెర్ మన్మధుడు సినిమాకి సీక్వెల్ వస్తుంది అన్న వార్తే ఎక్సయిటింగ్ గా ఉందనుకుంటే ఆ ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచే ఇంకో వార్త బయటకి వచ్చింది.దీంతో ఇంకా షూటింగ్ కి కూడా వెళ్లకుండానే మన్మధుడు-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇంతకీ ఆ క్రేజీ అండ్ కంఫర్మ్డ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో అక్కినేని అమల కూడా నటించబోతుంది.శివ తో సహా అనేక సినిమాల్లో నాగార్జునతో కలిసి నటించి ప్రేముంచి మరీ నాగార్జున ని పెళ్లాడిన అమల ఆ తరువాత నటనకి దూరమయింది.శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమా అమలకే కాదు నాగార్జునకి కూడా ప్రత్యేకం.రాహుల్ రవీంద్రన్ రాసిన ఈ స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు నాగార్జున.

ఈ సినిమాలో నాగార్జున డి డ్యూయల్ రోల్ అనే టాక్ ఉంది.నాగార్జున తండ్రి కొడుకుగా,రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అనేది పక్కా సమాచారం.అయితే ఇందులో అమలది కామియో రోల్ అని కొంతమంది అంటుంటే కొంతమంది మాత్రం తండ్రి పాత్రలో కనిపిస్తున్న నాగార్జున కి వైఫ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుంది అని మరికొంతమంది అంటున్నారు.ఆమె ఏ రోల్ చేసినా కూడా ఈ సినిమాకి ప్రత్యేకమయిన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో మాత్రం నో డౌట్.అందుకే అప్పుడే ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు.