మహర్షి కి లీక్ సెంటిమెంట్ కలిసొస్తుందా…?

mahesh-babu-maharshi
mahesh-babu-maharshi

మహర్షి…గత సంవసత్సరం సమ్మర్ లో భరత్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ స్వింగ్ లోకి వచ్చిన మహేష్ ఈ ఏడాది కూడా మహర్షి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.అయితే ఆ మైల్ స్టోన్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.సినిమాపై కూడా పోజివ్ వైబ్ క్రియేట్ అవుతుంది.ఇంతవరకు ఆల్ ఈజ్ వెల్.రీసెంట్ గా ఈ సినిమా షెడ్యూల్ పొలాచ్చి కి షిఫ్ట్ అయ్యింది.ఆ షెడ్యూల్ లో సినిమాకి కీలకమయిన సీన్స్ కొన్ని షూట్ చేసారు.

శ్రీమంతుడు తరహాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఆ సీన్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.ఆ వీడియోస్ లో మహేష్ ప్రెస్ మీట్ పెట్టి క్లాస్ పీకుతున్న సీన్స్ ఉన్నాయి.సినిమా ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమాకి సోల్ పాయింట్ అని తెలుస్తుంది.ఎన్ని రిక్స్ట్రిక్షన్స్ పెట్టినా,ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ వీడియోస్ లీక్ కావడంతో యూనిట్ కి లీక్ ఎలా జరిగింది అన్నది అంతుపట్టకుండా ఉంది.కానీ ఈ లీక్ విషయం తెలిసన ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.

దానికి కారణం ఒక సెంటిమెంట్.మహర్షి అనే మూడక్షరాల పేరు,ఏప్రిల్ లాస్ట్ వీక్ రిలీజ్ అనే సెంటిమెంట్స్ ని దర్శకనిర్మాతలు అడాప్ట్ చేస్తే అనుకోకుండా జరిగిన ఈ లీక్ కి ఫ్యాన్స్ కూడా ఒక సెంటిమెంట్ ని ఆపాదిస్తున్నారు.ఈ మధ్య టాలీవుడ్ లో సినిమా లీక్ అనేది సర్వసాధారణoగా మారింది.బాహుబలి లాంటి పెద్ద సినిమా నుండి టాక్సీవాలా లాంటి చిన్న బడ్జెట్ సినిమా వరకు కూడా ఈ లీకేజ్ అనే ప్రాబ్లెమ్ తప్పలేదు.అత్తారింటికి దారేది అయితే రిలీజ్ కి ముందే నెట్ లో ప్రత్యక్షమయింది.

ఇలా సినిమా లీక్ అవ్వడం అనేది మంచిది కాకపోయినా అలా లీక్ అయిన సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి.బ్లాక్ బస్టర్స్ గా నిలిచి కోట్లు కొల్లగొడుతున్నాయి.బాహుబలి-2,ఖైదీ నెంబర్ 150 ,గీత గోవిందం,టాక్సీవాలా ఇలా అన్నీ కూడా ఈ సెంటిమెంట్ ప్రకారం హిట్ అందుకున్నవే.ఇప్పుడు మహర్షి కి కూడా ఈ సెంటిమెంట్ ప్రకారం బ్లాక్ బస్టర్ హిట్ గారంటీ అని ఆనందపడుతున్నారు.నెగెటివిటీ లో కూడా పోజిటివిటీ వెదుక్కోవడం అంటే ఇదేనేమో.