మహర్షి ట్రైలర్ అప్పుడే

Maharshi
Maharshi

మహర్షి సినిమా మొదలయినప్పుడు ఉన్న హైప్ మెల్ల మెల్లగా తగ్గిపోతూ వస్తుంది.టీజర్ అంటూ ఆల్మోస్ట్ శ్రీమంతుడు సినిమా మళ్ళీ చూపించిన ఫీలింగ్ కలగడం దీనికి మొదటి కారణం.ఇక మహేష్ బాబు 25 వ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ డప్పులు పగిలిపోయేలా,కీ బోర్డు అరిగిపోయేలా పని చేసి రికార్డులు బద్దలైపోయేలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తాడు అని ఆశలు పెట్టుకున్నారు.కానీ దేవి అందించిన పాటలు ఆ అంచనాల దరిదాపుల్లోకి కూడా రాలేదు.దాంతో మహర్షి గురించి మాట్లాడడానికి గురించి మహేష్ అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.ఇలాంటి పరిస్థితుల్లో మహర్షికి ఊపిరిలూది,ఆ సినిమా లో అలరించే కంటెంట్ ఉంది అనేది కన్వే చెయ్యాల్సిన కీలకబాధ్యత ట్రైలర్ పై పడింది.

అందుకే టీజర్ ని తనకు నచ్చినట్టు కట్ చేసి నిరాశపరిచిన వంశీ ట్రైలర్ ని మాత్రం ప్రేక్షకులు నచ్చినట్టు కట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.అదే పనిలో ఉన్నాడు కూడా.అయితే ఆ ట్రైలర్ ని మాత్రం మే 1 న జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రివీల్ చెయ్యబోతున్నారు.నెక్లెస్ రోడ్ లోనో పీపుల్స్ ప్లాజా లో మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నారు.ఆ వేడుకలో ఆ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇప్పటివరకు సినిమాపై ఏర్పడిన డౌట్స్ కి ఈ ట్రైలర్ చెక్ పెడుతుంది ని యూనిట్ సభ్యులు ఆశాభవంతో ఉన్నారు.