సూపర్ డీలక్స్ ట్రైలర్ : సెన్సేషన్

Super Deluxe Trailer Review
Super Deluxe Trailer Review

తమిళ్ లో తెరకెక్కుతున్న సూపర్ డీలక్స్ సినిమాపై ముందు నుండి కూడా చాలా అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చాడు.అతనిలో ఉన్న నటుడు రోజు రోజుకి ఎంత షైన్ అవుతున్నాడు అనేది ఈ రెండు నిమిషాల ట్రైలర్ లోనే తెలిసిపోయింది.తన తొలిసినిమా ‘అరణ్య కాండన్’ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ త్యాగరాజన్ కుమార్ రాజా ఈ సినిమాని కూడా చాలా వైవిధ్యభరితంగా తీర్చిదిద్దాడు. మామూలుగా ట్రైలర్ అనగానే సినిమాలో నాలుగు షాట్స్ తీసి కాస్త స్పెషల్ గా ఆర్.

ఆర్ కొట్టించి కట్ చేస్తారు.కానీ ఈ సినిమామ్ ట్రైలర్ కోసం భిన్నమయిన ఒక థీమ్ ఎంచుకున్నారు.మన దగ్గర ఉండే బుర్రకథల టైపు లో ఈ సినిమాకోసం తమిళ్ నేటివిటీ కి సంబందించిన ఒక పిట్ట కథ చెప్పినట్టుగా చూపించి దానిపై విజువల్స్ పోస్ట్ చేసారు.ఇక ఈ సినిమాలో సమంత,రమ్యకృష్ణ  లాంటి పాపులర్ యాక్టర్స్ తో పాటు మలయాళంలో ఫేమస్ అయిన ఫహద్ ఫాజిల్ కూడా నటించాడు.ఈ సినిమా ట్రయిలర్ చూసినా కూడా ఈ సినిమా కథ గురించి గాని,జోనర్ గురించి గాని ఒక్క క్లూ కూడా దొరకదు.

అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక ఒక్క ఉత్కంఠ మాత్రమే కలుగుతుంది.దీనికి ఆన్సర్ దొరికేది మాత్రం మార్చ్ 29 నే.ట్రైలర్ తోనే సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత విజృభిస్తుందో,ఎలాంటి వేవ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సూపర్ డీలక్స్ ట్రైలర్