సునీల్ కి మెగా ఛాన్స్

Sunil
Sunil

ఈ జెనరేషన్ లో కమెడియన్స్ లో ఎవ్వరికి రానంత పేరు సునీల్ కి వచ్చింది.మొనాటనీ అనిపించినా కూడా హీరో అయ్యేవరకు సునీల్ కి ఫుల్ డిమాండ్ ఉండేది.తరువాత కూడా సునీల్ వద్దనుకోవడం వల్లే అవకాశాలు తగ్గాయి.అయితే హీరోగా మాత్రం సునీల్ కి టైం కలిసిరాలేదు.దాంతో సరయిన టైం లో మళ్ళీ కమెడియన్ గా యు టర్న్ తీసుకున్నాడు.’అరవింద సమేత’ సునీల్ కి రీ లాంచింగ్ సినిమా.కానీ నిజానికి అంతకుముందు ఖైదీ నెంబర్ 150 తో చిరు తో కలిసి రీ ఎంట్రీ ఇవ్వాల్సింది మిస్ అయ్యింది.

సైరా లో ఛాన్స్ మిస్ అవ్వడానికి కూడా చాలా కారణాలు వినిపించాయి.అయితే ఎట్టకేలకు మెగాస్టార్ 152 వ సినిమాలు సునీల్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది అని టాక్.కొరటాల మాటలకూ ఉన్న వెయిట్ సునీల్ టైమింగ్ కలగలిపితే,అది సరిగ్గా రీచ్ అయితే తప్పకుండా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది.మొత్తానికి మెగామేనల్లుడు చిత్రలహరి సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సునీల్ మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు.ఇలా కంటిన్యూ అయితే ఈజీగా మరో సెంచరీ కొట్టెయ్యొచ్చు.