సమ్మర్ బ్లాక్ బస్టర్ మజిలీ

Majili
Majili

పెళ్ళికి ముందే హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య ,సమంత కలిసి నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ.నిన్నుకోరి సినిమాతో డీసెంట్ సక్సెస్ అందుకున్న శివ నిర్వాణ తన సెకండ్ సినిమాకి కూడా మళ్ళీ లవ్ పెయిన్ అనే పాయింట్ నే టచ్ చేసాడు.సినిమాలోని ఫీల్ అండ్ ఎమోషన్ కి సమంత స్టార్డం అండ్ యాక్టింగ్ పొటెన్షియల్ కూడా తోడవడంతో మజిలీ ఫస్ట్ రోజే క్లీన్ హిట్ అనిపించేసుకుంది.ఉగాది ముందు రోజు రిలీజ్ అయిన మజిలీకి టైం ఫ్యాక్టర్ బాగా కలిసొచ్చింది.సరయిన కంటెంట్ ఉన్న సినిమా ఏదీ థియేటర్స్ లో లేకపోవడంతో టాక్ కి మించి కలెక్షన్స్ వర్షం కురిపించింది ఈ సినిమా.మల్టి ప్లెక్స్ లతో పాటు బి,సి సెంటర్స్ లో కూడా మజిలీ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది.కథ పరంగా తగ్గినా కూడా నీట్ గా ఉన్న నెరేషన్,సటిల్ కామెడీ తో పాటు హార్ట్ టచింగ్ మ్యూజిక్ కూడా మజిలీని విజేతగా నిలిపాయి.ఇలా అనుకున్న ఎలిమెంట్స్ అనుకున్న దానికంటే ఎక్కువగా వర్క్ అవుట్ అవడంతో సమ్మర్ లో సాలిడ్ హిట్ గా నిలిచింది మజిలీ.

మొదటి వారంతానికే లాభాల్లో అడుగుపెట్టిన మజిలీ ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్టాల్లోనే 21 కోట్ల షేర్ కొల్లగొట్టింది.ఇక ఈ సినిమాకి ఓవర్ సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.అక్కడ మిలియన్ మార్క్ దాటడం కష్టమే అయినా కూడా దాదాపు 8 లక్షల డాలర్స్ కొల్లగట్టం మాత్రం ఖాయం అని తేలిపోయింది.అలా మొదటివారానికే 26 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.దీంతో నాగచైతన్య హయ్యెస్ట్ గ్రాసర్ అయిన ”రారండోయ్ వేడుక చూద్దాం” ఫుల్ రన్ కలెక్షన్స్ ని వారంలోనే దాటేసింది.మజిలీ కలెక్షన్స్ ని ప్రభావితం చేసే సినిమాలు ఏవీ థియేటర్స్ లో లేకపోవడంతో సునాయాసంగా 50 కోట్ల గ్రస్స్ కలెక్షన్స్ సాధించి పెర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.మొత్తానికి చై సామ్ రిటర్న్స్ అనే సెంటిమెంట్ కేవలం టాక్ వరకే కాకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రూపంలో కూడా రిఫ్లెక్ట్ అవ్వడంతో సినిమా కొనుక్కున్న బయ్యర్స్ కూడా హ్యాపీ గా ఉన్నారు.