సబ్సిడీ గొర్రెలేవి..?

Goats, Sabsidy, Telangana, Trs, Congress,

జనగామ జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీలో తీవ్ర జాప్యం గా ఉంది .జనగామ అర్బన్‌ లో డీడీలు తీసి గొర్లకాపరులు నెలల తరబడి ఎదురు చూస్తున్నా. 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉంది. గొర్రెల కాపర్ల జీవితాల్లో వెలుగులు ఉందని పిస్తోంది .కానీ ఇప్పటి వరకు 1,407 యూనిట్లకు మాత్రమే ఇచ్చారు. మొదటి విడతలోనూ 313 యూనిట్లకు ఇప్పటి వరకు సబ్సిడీ అందనే లేదు. జనగామ జిల్లా లో నే 21,704 గొర్రెల యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం 10,750 యూనిట్లను మొదటి విడతలో ఎంపిక చేసింది.

10,437 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ అయి ఇంకా 313 యూనిట్లకు సబ్సిడీ ఇప్పటి వరకు రానే లేదు. రెండో విడతలో 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి. వీరంతా డీడీలు తీసి గొర్ల కోసం చుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు ఇచ్చారు 9547 యూనిట్లకు ఇవ్వాల్సి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 55 మందికి, దేవరుప్పులలో 11 మందికి పంపిణి చేయగా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఒక్కరికీ కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం.