అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల మూవీ సెకండ్ షెడ్యూల్…!

Allu Arjun 19
Allu Arjun 19

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నాపేరు సూర్య” తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటి నుంచి సెకండ్ షెడ్యూల్ జరగనుంది. బన్నీ 19వ సినిమాఈమూవీ నేడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూలు మొదలుపెట్టనున్నారట. ఈ మూవీలో బన్నీ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ఈ షెడ్యూలు షూటింగ్ లో పాల్గొనననున్నారని హారిక అండ్ హస్సిని క్రియేషన్స్ తమ ట్విట్టర్ ద్వార తెలిపారు.ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడ. గీతా ఆర్ట్స్,హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.