అల్లు హీరోగా “ఐకాన్”

Stylish Star Allu Arjun, Dil Rajuand Sriram Venu's next project
Stylish Star Allu Arjun, Dil Rajuand Sriram Venu's next project "ICON_ kanabadutaledhu"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలయికలో మరో సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే వుండే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధమ్ వంటి భారీ సూపర్ హిట్స్ వీరి కాంబినేషన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి అద్భుతమైన కథ, కథనం, అత్యున్నత సాంకేతిక విలువలతో MCA లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి “ఐకాన్”-కనబడుటలేదు అనే విభిన్నమైన టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సదరన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.. ఈ చిత్రం యూనిట్ అందరి తరుపున అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బ్యానర్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత.. రాజు
దర్శకత్వం.. శ్రీరామ్ వేణు