మ‌హిళా ఎంపీ వింత ప్ర‌వ‌ర్త‌న..ఆడుకుంటున్న నెటిజ‌న్లు

Strange behavior, Parliament Meetings, Lok Sabha, MP Kiran Kher, Ironically, Chandigarh MP, Like young children, Socialmedia, Viral,

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా మ‌రో ఎంపీ వింత ప్ర‌వ‌ర్త‌న ఆస‌క్తిక‌రంగా ఉంది .వివరలులోకి వెళ్ళగా… జనవరి 8 (మంగళవారం) లోక్‌సభ సమావేశాల్లో భాగంగా, ఆర్థికంగా వెనుకబడి జనరల్ కేటగిరీకి 10% రిజర్వేషన్ ఇచ్చే బిల్లుపై సీరియస్‌గా సాగుతున్న త‌రుణంలో ఓ మ‌హిళ ఎంపీ ఈ విధం గా ప్ర‌వ‌ర్తించారు. . సభ్యులంతా కోటా బిల్లు మంచిచెడ్డలపై చర్చాలో బిజీగా ఉంటే, ఎంపీ కిరణ్ ఖేర్ హాస్యాస్పదంగా ప్రవర్తించారు .ఈమె చండీగఢ్ ఎంపీ. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు ఆమెను ఆడుకున్నారు.

లోక్‌సభ కీల‌క బిల్లుకు ఆమోదముద్ర వేసే తరుణం లో ఖేర్ నవ్వుతూ, మరో సభ్యుడితో మాట్లాడుతూ , ఎవరికో సైగలు చేస్తూ కనిపించారు. సభ వ్యవహారాలతో సంబంధమే లేనట్టు ఉంది . ఎంపీ కిరణ్ ఖేర్ ఎవరితో మాట్లాడుతున్నారో, ఏమంటున్నారో తెలియదు. కానీ చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించి బోల్డంత విమర్శలు మూటగట్టుకున్నారు. ఆమె హావభావాలు, విచిత్ర ముఖకవళికలు చాలా విచిత్రం గా ఉన్నాయి .అందుకే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఎంపీగా ఉన్న విష‌యాన్ని మ‌రిచిపోయి జడ్జిగా ఉన్న ఎంటర్ టైన్ మెంట్ షో ఇండియాజ్ గాట్ టాలెంట్‌లో కూర్చున్న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని నేటి జనులు ఎద్దేవా చేస్తున్నారు.