పార్ల‌మెంట్ ముందు విభ‌జ‌న సెగ‌లు

Parliament house
Parliament house

ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాల‌ని తెలుగుదేశం పార్టీ ఎంపిలు డిమాండ్‌ చేశారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ కు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలంటూ పార్లమెంట్‌ ఆవరణలో వీరంతా ఫ్ల‌కార్డులు ప‌ట్టుకుని ఆందోళ‌న‌కు దిగారు. మోదీ హటావో దేశ్‌ బచావో అంటూ టిడిపి ఎంపీలు నినాదాలు చేశారు.

ప్రధాని మోదీ పాలనతో దేశంలో అశాంతి నెలకొందని పలువురు ఎంపీలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ఎంపిలు.