చైనాలో అదరగొడుతున్న శ్రీదేవి సినిమా

Sridevi Mom
Sridevi Mom

అత్యద్బుతమయిన నటనతో అనేకమంది అభిమానులను సంపాదించుని,అతిలోకసుందరిగా అనేక భారీ విజయాలు అందుకున్న శ్రీదేవి నటించిన చివరి సినిమా మామ్.ఆ సినిమాలో ఆమె నటనకు నేషనల్ అవార్డు సైతం అందుకుంది.అయితే ఆ సినిమా ఇక్కడ అనుకున్నంత విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.అయితే ఆ సినిమాని ఇప్పుడు ఇండియన్ సినిమాస్ కి న్యూ హబ్ గా మారిన చైనాలో రిలీజ్ చేశారు.ఎమోషనల్ కంటెంట్,డిఫరెంట్ సినిమాలకి కనకాభిషేకం చేస్తున్న చైనా బాక్స్ ఆఫీస్ దగ్గర మామ్ కి మంచి టాక్ వచ్చింది.కమర్షియల్ గా కూడా అదరగొడుతుంది.మే 10 న అక్కడ రిలీజ్ అయిన మామ్ నాలుగు రోజుల్లోనే దాదాపు 50 కోట్ల మార్క్ కి చేరువయింది.దీంతో ఫుల్ రన్ లో మామ్ 150 కోట్లకు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.కాకపోతే శ్రీదేవి ఎంతో ఇష్టపడి చేసిన మామ్ సాధించిన ఈ విజయం చూసి ఆనందించడానికి ఆమె లేకపోవడం విచారకరం.