‘తిప్పరా మీసం’… ఫస్ట్ లుక్

sree vishnu's tippara mesam movie
sree vishnu's tippara mesam movie

ఎప్పటికప్పుడు విభిన్నమయిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ విష్ణు ఇప్పుడు కూడా తిప్పరా మీసం అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఆ లుక్ చూస్తుంటేనే శ్రీవిష్ణుఁ మేకోవర్ అలరించేలా కనిపిస్తుంది.గుబురు గడ్డం తో ఉన్న శ్రీవిష్ణు ఇమేజ్ ని పోట్రె చేస్తూ ఇచ్చిన ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ కలిగించేలా ఉంది.

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో ఇదే బెస్ట్ ఫస్ట్ లుక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇంతకుముందు నారా రోహిత్ నటించిన అసుర సినిమాని డైరెక్ట్ చేసిన కృష్ణ విజయ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.పైగా విష్ణు నటించిన అప్పట్లో ఒకడుండేవాడు,నీది నాది ఒకే కథ లాంటి సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న కృష్ణవిజయ్ శ్రీవిష్ణు తో ట్రావెల్ చేసి అతని బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఈ కథ రాసుకున్నాడు.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు కు జోడిగా చెన్నై మోడల్ నిక్కీ తంబోలిని నటిస్తుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ ని త్వరలో రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు.