శ్రీలంక‌లో బుర‌ఖాపై కీల‌క నిర్ణ‌యం ..!

Srilanka Ban Burqua
Srilanka Ban Burqua

ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆదేశాల్లో వెల్ల‌డించింది. సోమవారం నుంచే ఈ నిబంధన వర్తిస్తుందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం పేర్కొంది. అత్యవసర నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ప్రజా రక్షణ కోసమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అతడి నుంచి ఉగ్ర సాహిత్యం, జర్మన్ తయారీ ఎయిర్‌గన్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.