రాహుల్ ను సోనియా ఎందుకు మెచ్చుకున్నారో తెలుసా ..!

sonia-rahul
sonia-rahul

కాంగ్రెస్‌ పార్టీలో నూతన జవసత్వాలు తీసుకు రావడానికి తన కుమారుడు రాహుల్ అవిశ్రాంతంగా పని చేస్తున్నాడంటూ కితాబిచ్చారు సోనియా గాంధీ. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాము నూతనోత్తేజంతో, విశ్వాసంతో పోటీ చేయబోతున్నామని ఆమె వెల్ల‌డించారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో సోనియా మాట్లాడారు. రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో సాధించిన విజ‌యాలు మ‌న‌లో కొత్త ఆశ‌ల్ని నింపాయ‌న్నారు ఆమె .

ప్ర‌త్య‌ర్థులు తాము అజేయుల‌మ‌న్న ధీమాతో వ్య‌వ‌హ‌రించార‌న్నారు సోనియా. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారిని ధీటుగా ఎదుర్కొన్నార‌ని, ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌భావితం చేశార‌ని రాహుల్‌ను ఆమె మెచ్చుకున్నారు. మోదీ ప్ర‌భుత్వంలో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.