చిన్న చూపు చూసిన ఈ సినిమాలే పెద్ద హిట్స్ గా నిలబడ్డాయి

husharu movie

ఏదైనా ఒక సినిమా వస్తున్నపుడు సరయిన ప్లానింగ్ నద్ పబ్లిసిటీ లేకపోతే దానిపై ప్రేక్షకుల్లో ఒకరకమయిన చులకనభావం ఉంటుంది.కానీ ఆ సినిమాలో కంటెంట్ బావుండి మౌత్ టాక్ తో ఆ సినిమా హిట్ అయితే మాత్రం ఔరా అనుకుంటారు.ఇప్పడు తెలుగులో సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న రెండు సినిమాల పరిస్థితి ఇదే.చిన్న సినిమా అనే ట్యాగ్ లైన్ తో వచ్చింది హుషారు.హీరోలు గాని,హీరోయిన్స్ గాని,కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ కూడా మినిమమ్ పాపులారిటీ ఉన్న వాళ్ళు కాదు.ఆ సినిమా లో కంటెంట్ యూత్ కి కనెక్ట్ అయిపొయింది.అంతే రెండున్నర కోట్లతో వచ్చిన ఆ సినిమా ఏడున్నర కోట్ల సాలిడ్ కలెక్షన్స్ సాధించింది.

ఈ ఫీట్ సాధించిన మరో సినిమా మాత్రం బిగ్ ప్రాజెక్ట్.అదే KGF.ఆ సినిమా కూడా రిలీజ్ రోజు వారం రోజుల సినిమా అన్నారు.కానీ సినిమా రిలీజ్ అయ్యి మూడు వరాలు గడుస్తున్నా కూడా ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.కన్నడ సినిమా కాబట్టి కర్ణాటక లో ఓకే.కానీ ఇంకా తెలుగులో కూడా అదే జోరు కనిపిస్తుంది.వరల్డ్ వైడ్ 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన KGF తెలుగులో విత్ అవుట్ ప్రొమోషన్ 10కోట్లు వసూళ్లు టార్గెట్ చెయ్యడం చిన్న విషయం కాదు.జనవరి కథానాయకుడు వచ్చేవరకు KGF లో ఢోకా లేదు.మొత్తానికి చిన్న చూపు చూసిన ఈ సినిమాలే పెద్ద హిట్స్ గా నిలవడం చూస్తే కంటెంట్ పవర్ అంటే ఏంటో అర్ధమవుతుంది.