సీత రివ్యూ

SITA Review
SITA Review

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ , సోనుసూద్
దర్శకత్వం : తేజా
నిర్మాత : అనిల్ సుంకర
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : శిరిషా రే
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్ రావ్
విడుదల తేదీ : మే 24, 2019
రేటింగ్ : 2 /5

తేజ…చిత్రం అనే విచిత్రమయిన సినిమా తీసి డైరెక్టర్ గా సెటిల్ అయిపోయిన తేజ చాలా కాలంగా పక్కాగా ఫ్లాపులనే అందిస్తూ వచ్చాడు.కానీ నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా తీసి హిట్ కొట్టడంతో మళ్ళీ తేజ పేరు బాగా వినిపించింది.అందుకే ఇప్పడు అతను తీసిన సీత సినిమాకి రిలీజ్ కి ముందు మంచి బజ్ వచ్చింది.ట్రైలర్ కాస్త పాత తరహాలో ఉన్నా కూడా కాజల్ ఒప్పుకుంది కాబట్టి ఒక మోస్తరుగా అయినా ఉంటుంది అనే అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన మోడరన్ సీత ఆకట్టుకుందా? లేక ఆమ్మో అనిపించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ: విషయానికి వస్తే చిన్నప్పటినుండి మొండిగా ఉంటూ,ఎలాగయినా కావాలనుకున్న దాన్ని దక్కించుకునే సీత తన కన్స్ట్రక్షన్ బిజినెస్ కోసం ఒక స్లమ్ ని ఖాళీ చేయిచాలనుకుంటుంది.అందుకోసం బసవరాజు అనే లోకల్ MLA కమ్ గూండాని హెల్ప్ అడుగుతుంది.దానికి అతడు ఆ హెల్ప్ చేయించునందుకు నెల రోజులు తనతో సహజీవనం చెయ్యాలని సీత కి కండిషన్ పెడతాడు.కానీ పని అయిపోయిన తరువాత ఆమె అతన్ని చీట్ చెయ్యడంతో అన్నివైపులనుండి లాక్ చేస్తాడు.దాంతో ఆ కష్టాలనుండి బయటపడడానికి చిన్నతనం నుండి భూటాన్ లో ఒక బుద్ధ ఆశ్రమంలో పెరుగుతున్న తన బావ రామ్ దగ్గరికి వెళుతుంది.అతన్ని కూడా తనతో తీసుకువచ్చి అతని ఆస్థి మొత్తం ఆమె పేరుతో రాయించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.చివరి సీత ప్రయత్నాలు ఫలించాయా?,ఆమె బసవరాజు నుండి ఎలా తప్పించుకుంది?,సీత తన మైండ్ సెట్ మార్చుకుని రామ్ ని పెళ్లిచేసుకుందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు: ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా పోషించి మెప్పించింది కాజల్ ఈ సినిమాలో అన్నిరకాల షేడ్స్ ఉన్న సీత అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించింది.కానీ ఆ పాత్ర ఆమెకి అంతగా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది.చాలా చోట్ల ఓవర్ యాక్షన్ లా అనిపించింది.దాంతో అక్కడక్కడా చిరాకుగా కూడా అనిపిస్తుంది.ఇక ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో డాన్సులు అండ్ ఫైట్స్ అంటూ నెట్టుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో అమాయకమయిన పాత్రలో కాస్త ఆర్టిఫిషియల్ గా నటించాడు.తన యాక్టింగ్ పొటెన్షియల్ కి మించిన పాత్ర కావడంతో అక్కడక్కడా క్లూ లెస్ గా కనిపించాడు.సోను సూద్ గతంలో ఏక్ నిరంజన్ సినిమా తరహా విలన్ పాత్రని మరోసారి పోషించాడు.అతని అసిస్టెంట్ గా తనికెళ్ళ భరణి కాస్త కామెడి పండించాడు.అభుమన్యు సింగ్,అభినవ్ గోమటం,మన్నారా చోప్రా,బిత్తిరి సత్తి ఇలా చాలామంది నటీనటులు ఉన్నా పెద్దగా ఇంపాక్ట్ ఉన్న రోల్స్ పడలేదు.మిగతావాళ్లంతా డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుపోయారు.పాయల్ రాజ్ పుత్ చేసిన స్పెషల్ సాంగ్ ఒక మోస్తరుగా ఉంది.

టెక్నీషియన్స్: కథపై ,తాను తీసిన ప్రోడక్ట్ పై తనకి జడ్జిమెంట్ ఉండదు అని చెప్పిన తేజ ఈ సినిమాని ఎంత రాంగ్ కాలిక్యులేషన్ తో తీసాడో సినిమా చూస్తే అర్ధమవుతుంది.హీరోయిన్ ఎంట్రీ,ఫస్ట్ హాఫ్ లో అలా అలా నడిచిన సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం టార్చర్ అనే పదానికి అర్ధం చూపిస్తుంది.ఇక క్లయిమాక్స్ అయితే ఇంకా అయిపోలేదా అనేంత ఇబ్బందిగా ఉంది.తేజ తీసిన సినిమాల్లో ఒక దారుణమయిన సినిమా సీత.కథ,కాస్టింగ్ ఇలా అన్నిటిలో కూడా ఫెయిల్ అయిన తేజ విలన్ ట్రాక్ రాసుకోవడంలో మాత్రం కాస్త బ్రెయిన్ పెట్టాడు అనిపిస్తుంది.ఇక ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ అందించిన సహకారం ఎలా ఉపయీగపడిందో అర్ధం కాదు.సినిమాటోగ్రాఫర్ శీర్షా రే సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపిస్తుంది.అనూప్ రూబెన్స్ సంగీతం ఓకే.నిర్మాణ విలువలు ఒక మోస్తరుగా ఉన్నాయి.

చివరిగా:తేజ చేసిన సరికొత్తప్రయోగం సరిగా సెట్ అవ్వకపోగా ఒక రకంగా మిస్ ఫైర్ అయ్యింది.సీత అనే ఒక పేరు పెట్టుకుని,ఆమె చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో సినిమా నడిపించాలని ట్రై చేసిన తేజ మరో సారి పూర్తిగా నిరాశపరిచే అవుట్ ఫుట్ ఇచ్చాడు.బి,సి సెంటర్స్ లో ఒక మోస్తరుగా పెర్ఫార్మ్ చేసే అవకాశాలున్న సీత ఓవర్ ఆల్ గా మాత్రం హిట్ గీత దాటలేకపోయింది.