వివాదాలపాలయిన ‘సీత’

Payal-Rajpoot
Payal-Rajpoot

సింపుల్ గా,సడెన్ గా ‘సీత’ అంటూ ఒక టీజర్ రిలీజ్ చేసి ఏప్రిల్ రిలీజ్ అంటూ అందరికి షాక్ ఇచ్చింది ఆ సినిమా యూనిట్.వాళ్ళ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటి అనేదానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.ఆ సినిమా నుండి బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ రిలీజ్ చేసారు.ఆ పాటలో పల్లవి దగ్గరినుండి అనేకసార్లు రెడ్డి కమ్యూనిటీ పేర్లు మెన్షన్ చేశారు.వాళ్లంతా పాయల్ పై పడి నలిపేస్తున్నట్టు ఉన్నాయి లిరిక్స్.ఫైనల్ గా ఆమె రెడ్డి గారి కుర్రాళ్లను అపార్ధం చేసుకున్నసారీ అంటూ ఆ పాటని పూర్తి చేస్తుంది.ఇప్పుడు ఆ లిరిక్స్ రెడ్డి కమ్యూనిటీ కి కోపం తెప్పించాయి.వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి.దాంతో సినిమా నుండి ఆ పాటని తొలగించాలని,లేదా ఆ లిరిక్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ నిరసనలు సోషల్ మీడియా కి పరిమితం అయ్యాయి.ఏదైనా ఛానెల్ కనికరించి ఒక డిబేట్ పెడితే ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తుంది.ఇదంతా చూస్తుంటే,సీత సినిమా నుండి ముందుగా ఐటెం సాంగ్ రిలీజ్ చెయ్యడం చూస్తుంటే ఇదంతా కావాలని చేసారా అనే డౌట్ రావడం ఖాయం.ఇప్పుడున్న ఎలెక్షన్ మూడ్ లో పబ్లిసిటీకి డబ్బుఖర్చుపెట్టడం వేస్ట్.అలా అని ఖాళీగా కూర్చుంటే సినిమా రిలీజ్ టైం కి అనుకున్న హైప్ రాకపోవచ్చు.సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఇలా చేస్తే పబ్లిసిటీ వస్తుంది అనే ప్లాన్ వేసినట్టు ఉంది యూనిట్.ఫైనల్ గా ఈ వివాదం ఏ రేంజ్ కి వెళుతుందో?,ఎక్కడ ఆగుతుందో చూడాలి.