వివేకా హత్య కేసు దర్యాప్తులో సిట్

ys vivekananda redyy
ys vivekananda redyy

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. వివేకా హత్యపై రెండు కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి వివాదాలు, అంతర్గత రాజకీయలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగిన వివేకా నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఘటనాస్థలంలో సాక్ష్యాల ధ్వంసంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. తలకు గాయాలు కనిపించకుండా టవల్‌ చుట్టడంపై ఆరా తీసున్నారు. కిరాయి హంతకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న‌ట్టు స‌మాచారం. వివేకా నివాసంలోని బెడ్ రూమ్, బాత్ రూమ్ లను సిట్ అదనపు డీజీ అమిత్ గార్గ్, సిట్ ఇన్ ఛార్జ్ అభిషేక్ మహంతిలు పరిశీలించారు.

మరోవైపు వివేకా కుమార్తె సునీత, వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల నుంచి సిట్ అధికారులు వివరాలను సేకరించారు. వివేకా డ్రైవర్ ప్రసాద్, పీఏ కృష్ణారెడ్డి, ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పనిమనిషి లక్ష్మి ల‌ను సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.