సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి ప్రారంభం..

Re-start-Sirpur-Paper-Mill-Kagaznagar

సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి ప్రారంభం.. టీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో పేపర్ మిల్లు పునరుద్దరణ. పూర్వ వైభవం దిశగా అడుగులు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ పవన్‌కుమార్‌ సూరి, ఎస్పీఎం ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి మిల్లులోని ఏడో కాగితం ఉత్పత్తి చేసే యంత్రాన్ని స్విచ్‌ ఆన్ చేసి ఉత్పత్తి ప్రారంభించారు. తెలంగాణ సర్కార్ చొరవతో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లులో మళ్లీ ఉత్పత్తి ప్రారంభమైంది. కాగా, 1932లో కుమురం భీం జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో స్థాపించిన మిల్లు నాలుగేళ్ల క్రితం మిల్లు యాజమాన్య వైఖరి, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో మూతపడింది. అయితే, తిరిగి ఉత్పత్తి ప్రారంభం కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.