ఆంధ్రలో బిజెపి కి గట్టి షాక్…!

Akula Satyanarayana

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కి గట్టి షాక్ తగిలింది.బిజెపి రాజమండ్రి అర్బన్‌ ఎమెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసారు.రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అందజేశారు. ప్రస్తుతం ఏపి బిజెపిలో తెలత్తిన వివాదాలు తనకు రుచించడం లేదని,కన్నాకు పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఐతే ఆకుల జనసేనలో చేరుతున్నట్టు సమాచారం. మరోవైపు ఆకుల సతీమణి జనసేనలో కోఆర్డినేటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.