శర్వా మళ్ళీ షాకిస్తాడా?

Sharwanand

యంగ్ జెనరేషన్ లో మీడియం రేంజ్ హీరోల్లో మంచి కథలతో తనకంటూ డీసెంట్ మార్కెట్ ఏర్పరచుకున్నాడు.ఈ మధ్య కాలంలో నిలకడగా హిట్స్ అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.కానీ అతని హిట్ ట్రాక్ అనుకోని విధముగా బ్రేక్ వేసింది పడి పడి లేచే మనసు.ఫస్ట్ హాఫ్ వరకు ఒక మ్యాజిక్ లా ఉన్న ఆ సినిమా సెకండ్ హాఫ్ నుండి డౌన్ ఫాల్ గ్రాఫ్ తో విసిగించింది.ఆ సినిమా సక్సెస్ మీట్ లో ఫెయిల్యూర్ రిజల్ట్ ని యాక్సెప్ట్ చేసిన శర్వా సుదీర్ వర్మ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.ఆ సినిమా ఎప్పుడో మొదలయినా కూడా సెట్ వరకు తో బడ్జెట్ పెరిగి మధ్యలో ఆగింది.దాంతో ముందు పడి పడి లేచే మనసు పూర్తి చేసాడు.ఇప్పడు మాత్రం ఆ సినిమా తిరిగి స్టార్ట్ అయ్యింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఆ సినిమా కోసం ఏకంగా ఒక పోర్ట్ సెట్ వేశారు.అయితే ఆ సినిమాలో శర్వా రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు.ఒకటి మామూలు పాత్ర.రెండోది మాత్రం కాస్త వయసు మళ్ళిన పాత్ర.ఇంత యంగ్ ఏజ్ లో అలాంటి గెటప్ లో కనిపించడానికి శర్వా ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండి ఉండాలి.అంటే ఆ సినిమాలో కంటెంట్ సంగతి పక్కనబెడితే మేకోవర్ తోనే షాక్ ఇచ్చేలా ఉన్నాడు.రియలిస్టిక్ టచ్ కోసం ప్రొస్తటిక్ టెక్నిక్ వాడి మరీ మేకప్ చేసారు.విరాట పర్వం 1990 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ పై మాత్రం క్లారిటీ లేదు.సో,ఈ సినిమా అయినా శర్వా కోరుకున్న సక్సెస్ అందిస్తుందని ఆశిద్దాం.