భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడ క‌న‌ప‌డ‌దు – ష‌ర్మిల

YS-Sharmila
YS-Sharmila

ముఖ్య‌మంత్రి చంద్రబాబు పాల‌న‌లో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లింద‌ని ఆరోపించారు వైసిపి నాయ‌కురాలు వైఎస్‌ షర్మిల. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన ఆయ‌న ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు.అమరావతిలో ఆమె మీడియా సమవేశంలో మాట్లాడారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు… రైతులను మోసం చేశారని విమర్శించారు. మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన ముఖ్య‌మంత్రి, తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. అదే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు చదివేవారని షర్మిల ఈ గుర్తు చేశారు. ప్ర‌స్తుతం జరగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమన్నారు షర్మిల.