మార్చి 3న సాహో చాప్టర్-2!

Get Ready For The Chapter2 On March 3rd ShadesOfSaahoChapter2 Saaho Prabhas

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకుడు. శ్రద్ధాకపూర్ కథానాయిక. మూడు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2ను చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మార్చి 3న ఈ చిత్రానికి సంబంధించిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2ని విడుదల చేస్తున్నాం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఙానంతో ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్, గ్రాఫిక్స్ సంభ్రమాశ్చర్యాల్ని కలిగించే స్థాయిలో ఉండనున్నాయి. ప్రభాస్ ైస్టెలిష్ నటన, దర్శకుడు సుజిత్ టేకింగ్, శ్రద్ధాకపూర్ గ్లామర్, శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం చిత్రానికి ప్రధాన హైలైట్స్‌గా నిలవనున్నాయి అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, ఆర్ట్: సాబు సిరిల్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.