సాహో ఛాప్టర్-2 హైలైట్స్ ఇవే

Get Ready For The Chapter2 On March 3rd ShadesOfSaahoChapter2 Saaho Prabhas

సాహో….బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ ఇది.ఏకంగా 250 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీమ్ సాహో చాప్టర్-1 పేరుతో రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో కి భారీ రెస్పాన్స్ దక్కింది.ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింతగా పెరిగింది.ఈ సినిమా గురించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ తో పాటు ఇండియా వైడ్ గా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీ లు ఫుల్ వెయిటింగ్ లో ఉన్నాయి.ఆ రేంజ్ లో ప్రభాస్ మార్కెట్ ని స్ప్రెడ్ చేసింది బాహుబలి.

అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి ఇంకా చాలా టైం ఉంది.అందుకే ఈ సినిమా నుండి మరొక మేకింగ్ వీడియో సిరీస్ ని చాప్టర్-2 పేరుతో రిలీజ్ చేయబోతుంది యూనిట్.మార్చ్ 3 ఈ సినిమా హీరోయిన్ శ్రద్దా కపూర్ పుట్టినరోజు ఆ సందర్భంగా ఛాప్టర్-2 వీడియో ని రిలీజ్ చెయ్యబోతున్నారు.అయితే సాహో లో శ్రద్ధ రోటీన్ గా అందాలు ఆరబోయడమే కాదు ఒక రేంజ్ లో చెలరేగి ఫైట్స్ కూడా చేసింది అంటున్నారు.అందుకే ఈ మేకింగ్ వీడియో లో ప్రభాస్ అండ్ శ్రద్దా కపూర్ కలసి ఉన్న షాట్స్ చూపించబోతున్నారు.

దీంతో సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యింది అనే విషయం లో కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది.వరల్డ్ క్లాస్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్స్ గా ఉండేలా,ఫ్యాన్స్ కి ట్రీట్ లాంటి హీరోయిక్ ఎలివేషన్స్ తో,నేషనల్ అప్పీల్ ఉన్న సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నాడు ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ సైన్.UV క్రియేషన్స్ అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్న సాహో ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.