సేవ్ ది నేషన్ – సేవ్ డెమోక్రసీ అంటున్న‌ది ఎవ‌రు ..!

save-the-nation-save-democracy
save-the-nation-save-democracy

మ‌రోసారి హ‌స్తిన బిజేపియేత‌ర ప‌క్షాల భేటీకి వేదిక‌య్యింది. సేవ్ ది నేషన్ – సేవ్ డెమోక్రసీ పేరుతో 25 పార్టీల నేతలలో కాన్సిటిట్యూషనల్ క్లబ్ లో బీజేపీయేతర పక్షాల సమావేశం జ‌రిగింది. ఈవీఎంల పనితీరు, వ్యక్తమవుతున్న అనుమానాలు , బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేయాల్సిన ర్యాలీలు, కార్యక్రమాలు తదితర అంశాలపై నేత‌లు చ‌ర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, గులాం నబీ ఆజాద్, డేరాక్ ఓబ్రెయిన్, కనిమొళి, శరద్ యాదవ్, శరద్ పవర్, ఆంటోనీ, అహ్మద్ పటేల్, రాంగోపాల్ యాదవ్, కోదండరాం తదితరులంతా హాజరయ్యారు.

అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై ప్రజలలో పార్టీలలో అనేక అనుమానాలున్నాయని,ఈ అంశంపై సోమవారం ఈసీతో సమావేశమవుతామన్నారు. నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న రాహుల్, రైతుకు రోజుకు 17 రూపాయలు ఇవ్వడం వారిని అవమానించినట్లే అన్నారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షాల సమావేశంలో ఈవీఎంల పని తీరుపై చర్చించామని.. కోల్ కతా సభలో ఒక కమిటీ వేసి నివేదిక తయారుచేశామని, ఆ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించమని.

ఈసీని కలిసి నివేదికను అందిస్తామన్నారు. ఈసీ నిర్ణయం తర్వాత ఎలా ముందుకెళ్లాలనేది చర్చిస్తామన్నారు. రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదన్న బాబు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పేదలను చేశారన్నారు. ఆయా రాష్ట్రాలలో పరిస్థితుల ఆధారంగా పొత్తులు ఉంటాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు ప్రతిపాదన లేదన్నారు.