నారా ఇంట సంక్రాంతి సంద‌డి

Chandra-Babu
Chandra-Babu

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మంత్రి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న మంత్రి లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు వచ్చారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నారా వారి పల్లెలో నిర్వహించిన భోగి వేడుకల్లో లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

దీనికి ముందు తిరుపతిలోని పీజీఆర్‌ థియేటర్‌లో నారా, నందమూరి కుటుంబాలు సందడి చేశాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూరుకు విచ్చేసిన నారా లోకేశ్‌, బ్రాహ్మణిలతో పాటు నందమూరి రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి ఇతర కుటుంబ సభ్యులంతా ప్రేక్షకులతో కలిసి ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ థియేటర్‌ యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికింది.