మ‌రో సంక్రాంతి కానుక‌ని ప్ర‌క‌టించిన సిఎం చంద్ర‌బాబు

N Chandrababu Naidu

రాష్ట్రంలో పింఛన్లు పెంచుతూ సంక్రాంతి సంబరా లను ప్రారంభించిన ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మరో సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఇక నుంచి 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సర ఫరా చేయాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఇస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచాలని, ఇందుకు సంబంధించిన విధివిధానా లను రూపొందించాలని ఇంధన శాఖ, విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని చెప్పారు.

మార్చి నెలాఖరుకల్లా వ్యవసాయ కనెక్షన్న మంజూరులో పెండింగ్‌ లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వల్ల దాదాపు 17 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని , బంగారం లాంటి పంటలు పండించుకోవచ్చని చెప్పారు.