ఫ్లాప్ ఇచ్చిన హీరో కి హిట్ ఇస్తా అంటున్న సంపత్

sampath-nandi
sampath-nandi

యంగ్ డైరెక్టర్స్ లో మాస్ పల్స్ బాగా పట్టుకుని మంచి విజయాలు అందుకున్నాడు సంపత్ నంది.రెండో సినిమాకే చిరంజీవి ని కన్వీన్స్ చేసి రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేసాడు అంటేనే సంపత్ టాలెంట్ అర్ధమవుతుంది.రచ్చ తరువాత ఏకంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్ రీమేక్ కి డైరెక్టర్ గా వెళ్లినా కూడా అక్కడ సిట్యుయేషన్స్ సింక్ అవ్వక ఆ ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది.కానీ రవితేజ తో బెంగాల్ టైగర్ అనే బ్రేక్ ఈవెన్ సినిమా ఇచ్చిన సంపత్ నంది ని నమ్మి సినిమా ఇచ్చాడు గోపీచంద్.అదే గౌతమ్ నందా.

సంపత్ మాస్ దారిని వదిలి ఎదో మెసేజ్ ఇద్దామని ట్రై చేసాడు.కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.గౌతమ్ నందా తరువాత మళ్ళీ గోపీచంద్ తో సినిమా చెయ్యాలని ట్రై చేసాడు.కానీ సంపత్ చెప్పిన రొటీన్ కథలను గోపీచంద్ నమ్మలేదు.అందుకే తన 26 వ సినిమా తమిళ్ డైరెక్టర్ తిరు తో చేస్తున్నాడు.కానీ సంపత్ నంది మాత్రం వేరే హీరోల గురించి ఆలోచించకుండా మళ్ళీ కొత్త కథ తయారు చేసుకుని గోపీచంద్ కి చెప్పాడు.

ఆ సినిమా లైన్ అండ్ కాన్సెప్ట్ గోపీచంద్ కి కూడా నచ్చడంతో తన 27 వ సినిమాగా దాన్ని ఫైనల్ చేసాడట.మొత్తానికి ఒక కథ రిజెక్ట్ చేసినా డిప్రెస్ అవ్వకుండా మరొక కథతో గోపీచంద్ ని ఒప్పించుకున్న సంపత్ నంది ని మెచ్చుకోవాల్సిందే.ఈ సారయినా తనకు అచొచ్చిన మాస్ కే ఎస్ అంటాడో లేక మళ్ళీ మరొక ప్రయోగానికి సై అంటాడో చూడాలి.