సమంత ఈ సారి కూడా మాయ చేస్తుందా?

samantha
samantha

సమంత పెళ్ళయినా కూడా అర్ధవంతమయిన సినిమాలు,ఛాలెంజింగ్ రోల్స్ తో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.గత సంవత్సరం వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న సమంత ఈ సంవత్సరం కూడా సమ్మర్ లోనే ప్రేక్షకులను పలకరించబోతుంది.2018 లో కూడా చాలా తక్కువ టైం లోనే రంగస్థలం,మహానటి లాంటి మరపురాని విజయాలు అందుకున్నసమంత ఈ సంవత్సరం మాత్రం ఒకే వారం గ్యాప్ లో రెండు సినిమాలతో పలకరించబోతుంది.ఆమె నటించిన తమిళ్ మూవీ సూపర్ డీలక్స్ ఈనెiల 29 న ప్రేక్షకుముందుకు రాబోతుంది.అలానే ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది మజిలీ.రెండు సినిమాల్లో కూడా సమంత కి మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి.మజిలీ కి సమంత స్పెషల్ అట్రాక్షన్.మరి పోయిన సంవత్సరంలా ఈ సారి కూడా ప్రేక్షకులను మాయ చేసి రెండు సినిమాలతో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.ఇవి కాకుండా సమంత నటంచిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓ బేబీ కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుంది.సమంత సినిమాల లైన్ అప్ చూస్తుంటే ఆమెతో ఆమే పోటీపడుతున్నట్టు ఉంది.