ఆ పాత్ర నుండి తప్పించుకున్న సమంత

Akkineni, Samantha, Marriage, Carrier, Work, Director, DUal role, Filmunit, Laxmi,

అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లి తరువాత హీరోయిన్ అనే కాకుండా అందరికి ఒక మంచి నటిగా కూడా దగ్గరువుతోంది. అవకాశాలు ఎన్నో వస్తాయి. కానీ అందరికి గుర్తుండిపోయే ఛాన్సులు రావడం చాలా అరుదు రావు అందరకు. కెరీర్ మొదట్లో చాలా సినిమాలు చేసిన సామ్ ఇప్పుడు మాత్రం తొందరెందుకు అన్నట్లుగా నిదానంగా ఆలోచిస్తు పరిస్థితికి అనుగుణం గా వర్క్ చేస్తోంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఒక కొరియన్ రీమేక్ నటిస్తోంది . అయితే ఆ సినిమాలో 70 ఏళ్ల భామ్మగా.. అలాగే 20 ఏళ్ల భామలా సమంత ద్విపాత్రాభినయం చేయనుందని టాక్ ఉంది తెలుసుగా . ఇది నిజమే అయినా ఈమే ఇప్పుడు మనసు మార్చుకుంది. ముసలి పాత్రలో కనిపిస్తే మార్కెట్ డ్యామేజ్ అనుకుంది అనుకుంటా, చివరికి ఆ పాత్రకు మొదలవ్వకముందే ఎండ్ కార్డ్ పెట్టినది. కానీ ఆ ఏజ్ లో కనిపిస్తేనే గా సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అలాగే అభిమానులకు కూడా మంచి క్రజ్ ఉంటుంది.

కానీ రిస్క్ ఎందుకని మొత్తానికి సమంత తప్పించుకుంది. చిత్ర యూనిట్ కూడా టైమ్ , ఎక్కువగా ఖర్చు చేయడం ఎందుకు అని ఆలోచించి పెద్దావిడ పాత్ర కోసం సీనియర్ నటి లక్ష్మిని ఎంచుకున్నారని పుబ్లిక్ టాక్. ఒరిజినల్ కథలో నటించింది కూడా వేరు వేరు నటీనటులే..ఈ సినిమా లో సమంత ఎప్పటిలానే యువతిలా కనిపించనుంది. ఇక ఈ ప్రయోగాత్మక లో నాగ శౌర్య కీలకపాత్రలో నటిస్తున్నాడు.