96 రీమేక్ ఆన్ ట్రాక్

Sharwanand,Samantha
Sharwanand,Samantha

టాలీవుడ్ లో పక్కాగా సినిమాలు తీసి,దీని మాక్సిమం ప్రోమోట్ చేసి,అనుకున్న టైం కి రిలీజ్ చెయ్యడం దిల్ రాజు అలవాటు.అదే ఆయన్ని అంత పెద్ద ప్రొడ్యూసర్ గా మార్చింది.టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న పెద్ద బ్యానర్స్ లో SVC టాప్ 5 లోఉంటుంది.గత సంవత్సరం వరుసగా అపజయాలతో డీలా పడిన SVC కి F2 100 కోట్ల వసూళ్ల రూపంలో ఫుల్ కిక్ ఇచ్చింది.

దీంతో దిల్ రాజు ఎంతో ఇష్టపడి రీమేక్ రైట్స్ కొనుకున్న తమిళ్ సూపర్ హిట్ మూవీ 96 పట్టాలెక్కిస్తున్నాడు.అనుకున్నట్టుగానే శర్వానంద్,సమంత లతో ఈ సినిమా అనౌన్స్ చేసాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 34 వ సినిమాగా తెరకెక్కుతున్న 96 రీమేక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాని కూడా రూపొందిస్తున్నాడు.ఫీల్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి,సెన్సిబిలిటీస్ మిస్ అవ్వకుండా కాప్చర్ చెయ్యాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది సినిమాకి కలిసొచ్చేదే.ఇక శర్వా,సమంత ఇద్దరూ కూడా కంటెంట్ ఉన్న యాక్టర్స్ కావడంతో ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుంది అనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.గతంలో దిల్ రాజు నమ్మకంగా నిర్మించిన శతమానం భవతి నేషనల్ అవార్డు సైతం దక్కించుకోగా శ్రీనివాసకల్యాణం ఫెయిల్యూర్ గా నిలిచింది.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుంది అన్నది చూడాలి.