మామ కి కోడలు హిట్ ఇస్తుందా?

Samantha Akkineni

పెళ్లితరువాత జనరల్ గా అయితే హీరోయిన్ కెరీర్ కి ఎండ్ కార్డు పడుతుంది.చాలా మంది విషయంలో ఇదే జరిగింది.కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా వరుసగా వరుసగా సినిమాలు చేస్తూ,బ్లాక్ బస్టర్స్ కొడుతూ తన ఫాలోయింగ్ ని రోజు రోజుకి పెంచుకుంటుంది.రీసెంట్ గా మజిలీ సినిమా హిట్ లో ఎక్కువ క్రెడిట్ కూడా సమంత కే ఇచ్చారు అంతా.అయితే ఇప్పుడు నాగ్ కూడా సమంత మ్యాజిక్ ని నమ్ముతున్నాడు.

అందుకే తాను రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో చేస్తున్న మన్మధుడు-2 లో సమంతకు ప్లేస్ కల్పించారు.ముందు నుండి సమంతతో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న రాహుక్ రవీంద్రన్ నటనకి మంచి స్కోప్ ఉన్న కీ రోల్ ఒకటి సమంత కోసం రాసుకుని ఆమెకి వినిపించాడు.దానికి ఆమె ఓకే అంది.ఇక సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె ఎంపిక ఖాయం అయ్యింది.ఈ సినిమాలో రకుల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పుడు సమంత కూడా చేరడం మన్మధుడు-2 కి అన్ని విధాలా ప్లస్ గా మారింది.మరి చైతూ కి బ్లాక్ బస్టర్ అందించిన సమంత మామ కి కూడా గ్రాండ్ హిట్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అనే టైటిల్ కి జస్టిఫై చేస్తుందో లేదో అనేది త్వరలో తేలుతుంది.