సెక్యూరిటీ గార్డ్ పై చేయి చేసుకున్న సల్మాన్…!

Salman Khan
Salman Khan

సల్మాన్ ఖాన్ భారత్ సినిమా బుధవారం నాడు విడుదల అయ్యి భారీ విజయం అందుకుంది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె, ప్రీమియర్ షో సందర్భంగా ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సల్మాన్ ఖాన్ నడుచుకుంటూ వెళ్తుండగా… వెనకనే ఉన్న తన సెక్యూరిటీ గార్డ్ ఓ అభిమానిని పక్కకు లాగి కొట్టాడు. వెంటనే రియాక్టయినా సల్మాన్.. గార్డ్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా షాక్ అయ్యారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెక్యూరిటీ గార్డ్ ను కొట్టడం కొందరు తప్పుపడుతుంటే.. కొందరు మాత్రం.. అభిమాని కోసం సల్మాన్ చేసింది కరెక్ట్ అని అని అంటున్నారు.