గబ్బర్ సింగ్ 3 మొదలవుతుంది

Dabbang 3
Dabbang 3

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దాదాపు 10 సంవత్సరాల తరువాత అతని స్థాయికి తగ్గ పవర్ ఫుల్ హిట్ గా నిలిచింది గబ్బర్ సింగ్.అందుకే ఆ సినిమా పవన్ కెరీర్ లో చాలా ప్రత్యేకం.అయితే దానికి ఎంతగా హరీష్ శంకర్ మార్క్ అద్దినా కూడా ఆ సినిమా ఒరిజినల్ మూవీ దబాంగ్ లో ఉన్న సల్మాన్ క్యారెక్టరైజేషన్ పవన్ లో కూడా రిఫ్లెక్ట్ అవ్వడం వల్లే ఆ సినిమా హిట్ అయ్యింది.దబాంగ్ -2 కూడా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.కానీ పవన్ దాన్ని కాదనుకుని సొంతంగా ఒక కథారాసుకుని సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా చేశాడు.కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

అయితే ఇప్పడు బాలీవుడ్ లో దబాంగ్-3 స్టార్ట్ అవుతుంది.ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథతో ఈ సీక్వెల్ తెరకెక్కుతుంది.అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్,సోనాక్షి ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.ఇక బాలీవుడ్ లో కూడ మాస్ మసాలా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రభుదేవా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావడానికి ఇంకా టైం పడుతుంది.

ఒక వేళ ఎలెక్షన్స్ తరువాత మళ్ళీ పవన్ సినిమాలు చేస్తే మాత్రం ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశం లేకపోలేదు.గబ్బర్ సింగ్ అనే బ్రాండ్ కి ఉన్న వేల్యూ కోసమయినా పవన్ ఈ ప్రాజెక్ట్ ఎత్తుకుంటాడు.మరి దబాంగ్-3 ఇక్కడ గబ్బర్ సింగ్-3 గా రిమేక్ అవుతుందా? లేదా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.