మరో రికార్డు సొంతం చేసుకున్న సాయి పల్లవి పాట

Sai Pallavi

ఫిదా…ఈ లవ్ స్టోరీ సినిమా లవర్స్ అందరిని ఫిదా చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందులోని వచ్చిండే సాంగ్ కూడా అంత పెద్ద హిట్.ఆ సాంగ్ కి అన్నీ పక్కాగా కుదిరి సంచనలన విజయం సాధించింది.అయితే ఇప్పడు ఆ సాంగ్ కి ఒక అరుదయిన రికార్డ్ దక్కింది.ఈ సాంగ్ యు ట్యూబ్ లో సౌత్ మొత్తంలో 174 మిలియన్ వ్యూస్ తో మోస్ట్ వాచింగ్ సాంగ్ గా మొదటి ప్లేస్ దక్కించుకుంది.

రీసెంట్ గా మోస్ట్ వ్యూడ్ తెలుగు సాంగ్ అనే రికార్డ్ కైవసం చేసుకున్న ఈ పాట ఇప్పడు ఈ క్రెడిట్ కూడా దక్కించుకుంది.ఇంతకుముందు సౌత్ లో నెంబర్ ప్లేస్ లో కొలవెరిడి సాంగ్ ఉండేది.అప్పట్లో ఎక్కడికక్కడ మారుమోగింది ఆ పాట ఎనిమిదేళ్లలో 172 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది.కానీ ఫిదా సాంగ్ మాత్రం కేవలం సంవత్సరం నాలుగు నెలల్లోనే ఈ ఘనత సాధిచింది.దీంతో అత్యంత త్వరగా ఆ రికార్డ్ ని దక్కించుకున్న పాటగా మరో రికార్డ్ కూడా వచ్చిండే సాంగ్ కి దక్కింది.

ఈ పాట ట్యూన్,సాయి పల్లవి గ్రేస్ ఫుల్ డాన్స్,శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ,మధు షాలిని ఎనేర్జిటిక్ సింగింగ్ అన్నీ కలిసి ఈ పాటకి ఈ ఘనత సాధించి పెట్టాయి.భానుమతి హవా థియేటర్స్ లోనే కాదు యు ట్యూబ్ లో కూడా ఇంకా కొనసాగుతుంది.ఇప్పటికీ అంతే వేగంగా దూసుకుపోతున్న ఈ పాట ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.