పారితోషికం తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి…!

Sai Pallavi
Sai Pallavi

తెలుగులో ఫిదా సినిమాతో తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది సాయి పల్లవి.ఈ సినిమాతో తెలుగు లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. తాజాగా ఆమె శర్వానంద్ సరసన హీరోయిన్ గా పడి పడి లేచే మనసు సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది.

కథను తప్ప పారితోషికానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని సాయిపల్లవి ఈ సినిమాలో నటనతో ఆకట్టుకున్నప్పటికీ సినిమా ప్లాప్ జాబితాలో చేరడంతో తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసింది. సాధారణంగా తమ సినిమాలు ఆడనప్పుడు స్టార్ హీరోలు కొంతమంది ఇలా చేస్తుంటారు. కానీ హీరోయిన్ సాయిపల్లవి పారితోషికం తిరిగి నిర్మాతకు ఇవ్వడం పట్ల టాలీవుడ్ లో పలువురు ఆమెను అభినందిస్తున్నారు.