చిత్రలహరికి కోత

Sai-Dharam-Tej
Sai-Dharam-Tej

ఎంట్రీ ఇస్తూనే ఏకంగా హ్యాట్రిక్ హిట్స్(రేయ్ ని మినహాయించి) అందుకున్న మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఇప్పడు అస్సలు బాగాలేదు.మూడు హిట్స్ ఇచ్చిన మార్కెట్ ని ఆరు వరుస ఫ్లాపులు దారుణంగా దెబ్బ తీశాయి.తేజ్ ఐ లవ్ యూ సినిమా టోటల్ గా తేజు సినిమా అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ ఆసక్తి ఉంది అనేది చూపించింది.ఇక అంతా కష్టం అనుకోవడంతో స్వయంగా చిరు లైన్ లోకి వచ్చి చరణ్ కి వినట్టే కథలు విని ఓకే చెయ్యడం అనే ప్రాసెస్ మొదలయింది.

నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమల స్టార్ట్ చేసిన చిత్రలహరి సినిమా అలా మొదలయిందే.నాని రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ ని తేజు తో మొదలు పెట్టారు.అయితే బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ ముందు ఈ సినిమాని 20 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో సెట్స్ కి తీసుకువెళ్ళింది.కానీ ఆ సినిమా కి వస్తున్న బిజినెస్ ఎంక్వైరీస్ తో షాక్ అయ్యి సినిమా బడ్జెట్ కి 5 కోట్ల కోత విధించారట.15 కోట్లలో సినిమా తీస్తే కూడా కోటివరకు డెఫిషిట్ ఉండొచ్చు అనేది అంచనా.

ఇంతకు ముందు కూడా సవ్యసాచి,అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలకు హీరోల రేంజ్ కి మించి ఖర్చు చేసి నష్టాలు మూటగట్టుకున్న మైత్రి ఇప్పుడు మాత్రం కాస్ట్ కటింగ్ ఫార్ములా ఫాలో అవుతుంది.అంటే వాళ్లకు వచ్చే లాభాలు కేవలం సాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ మాత్రమే.ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ మార్కెట్ లేని హీరోలతో సినిమాలు చేసే ఆలోచన విరమించుకోవడం ఖాయం అనిపిస్తుంది.ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ తేజు కి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టే.లేదంటే సినిమా రావడం కూడా కష్టమే.