RRR పై జక్కన్న క్లారిటీ

RRR Movie
RRR Movie

RRR సినిమాకి ఇప్పడు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు.కానీ జక్కన్నఊహల్లో మాత్రం ఈ సినిమా కేవలం ఒక రీజినల్ సినిమా కాదు.ప్యాన్ ఇండియా మూవీ.అంటే బాహుబలి తరహాలో మొత్తం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే దానికి కారణం రాజమౌళి కి ఉన్న ఇమేజ్ కాదు కథ,సినిమాకు ఉన్న భారీ బడ్జెట్.

అందుకే ఈ సినిమా కథ విషయంలో రాజమౌళి అంత టైం తీసుకున్నాడు.ఎదో ఒక ప్రాంతానికి చెందిన కథలా చూపిస్తే డబ్బింగ్ వెర్షన్ కి స్కోప్,టాక్ తగ్గుతుంది.దాంతో బాహుబలి తో ఏర్పడిన మార్కెట్ డ్రాప్ అవుతుంది.అందుకే ఈ సినిమాకి ప్రీ ఇండిపెండెన్స్ డే మూమెంట్ ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నారు.దీంతో గ్రాండియర్ పరముగా తిరుగుండదు.ఇక బాలీవుడ్ మార్కెట్ లో పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు అయితే మినిమమ్ గ్యారంటీ.

అందుకే ఈ లెక్కలన్నీ పరిణగణనలోకి తీసుకుని రాజమౌళి అలా డిసైడ్ అయ్యాడు.ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అని రాజమౌళి క్లారిటీ ఇచ్చేయడంతో బాలీవుడ్ లో కూడా భారీ రిలీజ్ ఉంటుంది అనేమాట కన్ఫర్మ్ అయిపోయింది.దీంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులు,అటు రామ్ చరణ్ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.ఇక నుండు రాజమౌళి ఏ సినిమా చేసిన టైం రెండేళ్లు,బడ్జెట్ మూడు వందల కోట్లు,బాలీవుడ్ రిలీజ్…రిటర్న్స్ వెయ్యికోట్లు పైనే అనే టాగ్స్ మాత్రం కంపల్సరీ అనేలాఉంది పరిస్థితి.

మరి ప్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న RRR కి టైటిల్ అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్ ఆలోచించడం కూడా కష్టమే.ఈ ఒక్క ఉదాహరణ చాలు జక్కన్న పనితనం ఎవ్వరి ఊహలకి అందకుండా ఉంటుంది అని ప్రూవ్ చెయ్యడానికి.