సిరిసిల్లాలో భోజ‌నం ఐదు రూపాయ‌లే ..!

5 rs meals
5 rs meals

ఒక‌ప్పుడు ఉరి సిల్లాగా వున్న సిరి సిల్లాలో ఇప్పుడు ఐదు రూపాయ‌ల‌కే క‌డుపు నిండా భోజ‌నం ల‌భిస్తోంది. జిల్లా కేంద్ర‌మైన సిరిసిల్లాలో స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్షయపాత్ర ప‌ధ‌కానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఐదు రూపాయ‌ల‌కే ఈ భోజనం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రోజుకు 540 మందికి భోజనం లభించనుంది.

దీంతో వంద‌లాది పేద‌ల క‌డుపులు నిండ‌నున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ భోజన కేంద్రం ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్. ఇక్కడ అన్నార్తులకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తుందని చెప్పారు. అనంత‌రం ఆయ‌న ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు.